గులాబీ గుబాళిస్తుందా?.. కమలం వికసిస్తుందా?

ABN , First Publish Date - 2020-11-08T01:00:51+05:30 IST

ఎగ్జిట్‌పోల్స్ ఏమి చెబుతాయా అని ఇవాళ భారతదేశం మొత్తం ఎదురుచూస్తోంది. దేశ వ్యాప్తంగా బీహార్ రాష్ట్రంతో పాటు 90 స్థానాల్లో ఉపఎన్నికలు జరిగాయి. ఇవన్నీ దృష్టిలో...

గులాబీ గుబాళిస్తుందా?.. కమలం వికసిస్తుందా?

ఎగ్జిట్‌పోల్స్ ఏమి చెబుతాయా అని ఇవాళ భారతదేశం మొత్తం ఎదురుచూస్తోంది. దేశ వ్యాప్తంగా బీహార్ రాష్ట్రంతో పాటు 90 స్థానాల్లో ఉపఎన్నికలు జరిగాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అంచనాలు కీలకంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్‌కు సంబంధించి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏను ఈసారి వెనుక్కు తోచేస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వీ యాదవ్‌కు పట్టంకట్టే పరిస్థితి ఉందంటూ ఎగ్జిట్ పోల్స్ చూపిస్తున్నాయి. ఆర్జేడీ కూటమి బీహార్‌లో అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ స్థానాలు దక్కించుకోనుందని తెలుస్తోంది. 


తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక దుమ్మురేపిన విషయం తెలిసిందే. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ మధ్య చాలా ఉత్కంఠబరితంగా పోరు జరిగింది. అయితే మెజార్టీ ప్రజలు టీఆర్ఎస్ దే విజయం ఉంటుందని అంటున్నారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ గెలిచే అవకాశం ఉందని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ‘‘గులాబీ గుబాళిస్తుందా?. కమలం వికసిస్తుందా?.బీహార్‌లో నితీశ్ నిలబడేనా?. యువ తేజో కెరటం ఎగసేనా?. మోదీ మాయ ఇంకా ఉందా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Updated Date - 2020-11-08T01:00:51+05:30 IST