దుబ్బాకలో మారిన సీన్

ABN , First Publish Date - 2020-10-27T21:07:19+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నికల పోల్ వార్ కమలం వైపు జంప్ అయిందా?

దుబ్బాకలో మారిన సీన్

సిద్ధిపేట: దుబ్బాక ఉప ఎన్నికల పోల్ వార్ కమలం వైపు జంప్ అయిందా? టీఆర్ఎస్‌కు ధీటుగా బీజేపీ దూసుకువెళుతోందా? డబ్బుల వ్యవహారం ఉప ఎన్నికలో హీట్ పెంచిందా? ఓటర్లను బీజేపీ తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి. బీజేపీ కార్యకర్తలు దుబ్బాకలో దుమ్మురేపారు. ఒక్క రోజులో హీట్ పెరిగిపోయింది. ఇప్పటి వరకు అటూ.. ఇటూ అనుకుంటున్న పోల్ వార్ కమలం వైపు జంప్ చేసింది. ఒక్కసారిగా బీజేపీ హైలెట్ అయిపోయింది. ఒకవైపు హరీష్ రావు పకడ్బంధిగా స్కెచ్ వేసుకుంటూ దుబ్బాకలో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవాలని అడుగులు వేస్తున్నారు.


మరోవైపు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఈ హడావుడిలో రఘునందన్‌రావు పెద్దగా హైలెట్ కాలేదు. కానీ బీజేపీ గ్రౌండ్ లెవెల్లో తన పని సైలెంట్‌గానే చేసుకుపోతోంది. ఇంటింటి ప్రచారంతో కమలనాథులు గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. మొదట్లో బీజేపీ భయపెడుతుందని వచ్చిన వార్తలు.. తర్వాత రాలేదు. కానీ ఇప్పుడు పోలీసులు హైడ్రామాతో బీజేపీకి గులాబీ సేన భయపడుతుందనే కామెంట్లు మొదలయ్యాయి. డబ్బులు దొరికాయా? పెట్టారా? తర్వాత సంగతి. ఈ డబ్బుల వ్యవహారాన్ని జనం లైట్ తీసుకుంటున్నారు. కానీ వరుసగా జరిగిన ఘటనలు బీజేసీ టీఆర్ఎస్‌కు ధీటుగానే స్పందించిందనే కామెంట్లు వినపడుతున్నాయి.

Updated Date - 2020-10-27T21:07:19+05:30 IST