దుబ్బాకలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

ABN , First Publish Date - 2020-11-03T16:00:16+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

దుబ్బాకలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దుబ్బాక నియోజకవర్గం గ్రామీణ ప్రాంతం కావడంతో వ్యవసాయదారులు పనులకు వెళతారుకాబట్టి ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలి వస్తున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఓటర్లకు టెంపరేచర్‌ చెక్‌ చేసి మాస్క్‌లు, గ్లౌజులు అందజేస్తున్నారు. భౌతికదూరం పాటించేలా అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. పోటీలో 23 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యే ఉంది. టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. దీంతో ముక్కోణపు పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

Updated Date - 2020-11-03T16:00:16+05:30 IST