దుబ్బాక బీజేపీ అభ్యర్థిగా రఘనందన్‌రావు పేరు పరిశీలనలో ఉంది: జితేందర్ రెడ్డి
ABN , First Publish Date - 2020-10-04T01:00:40+05:30 IST
దుబ్బాక బీజేపీ అభ్యర్థిగా రఘనందన్‌రావు పేరు పరిశీలనలో ఉందని ఆ పార్టీ నేత జితేందర్ రెడ్డి ప్రకటించారు. జాతీయనాయకత్వం ఆదేశాలు రాగానే అభ్యర్థిని ప్రకటిస్తామని
హైదరాబాద్: దుబ్బాక బీజేపీ అభ్యర్థిగా రఘనందన్‌రావు పేరు పరిశీలనలో ఉందని ఆ పార్టీ నేత జితేందర్ రెడ్డి ప్రకటించారు. జాతీయనాయకత్వం ఆదేశాలు రాగానే అభ్యర్థిని ప్రకటిస్తామని, దుబ్బాకలో బీజేపీకి ప్రజాదరణ బాగుందని జితేందర్ రెడ్డి తెలిపారు. అయితే బీజేపీ అభ్యర్థిగా మరోసారి బరిలో నిలవాలని రఘునందన్‌రావు ఆశిస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో ఆయనే పోటీ చేశారు. ఉప ఎన్నిక అనివార్యమని తెలిసిన వెంటనే స్థానిక బీజేపీ నేతలు ప్రచారం ప్రారంభించారు. కొద్ది రోజులకే రఘునందన్‌రావు కూడా పూర్తిగా ప్రచారంలోకి దిగారు. స్థానికంగా ఇతర నేతలు టికెట్ ఆశిస్తున్నప్పటికీ రఘునందన్‌రావు వైపే పార్టీ అగ్రనాయకత్వం మొగ్గు చూపుతోందని తెలుస్తోంది.
మరోవైపు సిటింగ్ స్థానాన్ని మంచి మెజార్టీతో తిరిగి తమ ఖాతాలో వేసుకునేందుకు టీఆర్‌ఎస్ పక్కా వ్యూహంతో వ్యవహరిస్తోంది. రామలింగారెడ్డి మరణం తర్వాత మంత్రి హరీశ్‌రావు దుబ్బాకలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌కే ఓట్లేస్తామని పలు గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారు. 50 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని టీఆర్‌ఎస్ అధిష్ఠానం ముఖ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రామలింగారెడ్డి సతీమణికే అభ్యర్థిగా అవకాశం ఇస్తారని భావిస్తున్నారు.