రేపటిలోగా దుబ్బాక అభ్యర్థిని ఖరారు చేస్తాం: ఉత్తమ్

ABN , First Publish Date - 2020-10-04T22:50:10+05:30 IST

రేపటిలోగ దుబ్బాక అభ్యర్థిని ఖరారు చేస్తామని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. తన నుంచి కార్యకర్త వరకు దుబ్బాక ఉపఎన్నిక బాధ్యతలు అప్పగిస్తున్నామని

రేపటిలోగా దుబ్బాక అభ్యర్థిని ఖరారు చేస్తాం: ఉత్తమ్

హైదరాబాద్: రేపటిలోగ దుబ్బాక అభ్యర్థిని ఖరారు చేస్తామని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. తన నుంచి కార్యకర్త వరకు దుబ్బాక ఉపఎన్నిక బాధ్యతలు అప్పగిస్తున్నామని, 8వ తేదీలోగా నేతలు, కార్యకర్తలకు అప్పగించిన గ్రామాల్లో ఉండాలని ఆదేశించారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్, గ్రేటర్‌ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్‌, ప్రియాంక పట్ల యూపీ పోలీసుల తీరు దారుణంగా ఉందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

Updated Date - 2020-10-04T22:50:10+05:30 IST