దుబ్బాక ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయాలి

ABN , First Publish Date - 2020-10-03T09:43:18+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయాలి

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయాలి

స్థానిక నేతలు, కార్యకర్తల డిమాండ్‌ 

సమగ్రంగా చర్చించి నిర్ణయం: రమణ


హైదరాబాద్‌, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ తరపున కచ్చితంగా పోటీచేయాలని టీడీపీ స్థానిక  నాయకులు రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. దుబ్బాక నుంచి పలువురు పార్టీ నాయకులు శుక్రవారం ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ బీజేపీకి మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. అనంతరం ఎన్టీఆర్‌ భవన్‌లోనే రమణను కలిసి నియోజకవర్గంలో పార్టీకి కేడర్‌ ఉందని తెలిపారు. పార్టీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి ఇల్లెందు రమేశ్‌కు బీఫాం ఇవ్వాలని కోరారు. అయితే, అందరితో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని  రమణ చెప్పారు. కాగా, సేవా కార్యక్రమాల్లో టీడీపీ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని రమణ అన్నారు. గాంధీజీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులర్పించారు. తెలుగు యువత, ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 

Updated Date - 2020-10-03T09:43:18+05:30 IST