దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు
ABN , First Publish Date - 2020-10-07T07:45:06+05:30 IST
దుబ్బాక ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావునే ఆ పార్టీ ఖరారు చేసింది.

బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు ఖరారు
అధికారికంగా ప్రకటించిన అధిష్ఠానం
హైదరాబాద్, అక్ట్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): దుబ్బాక ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావునే ఆ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. వివిధ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్.. దుబ్బాకకు రఘునందన్ పేరునూ ప్రకటించారు.
ఇంతకుముందే రఘునందన్ అభ్యర్థిత్వంపై సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర పార్టీ నాయకత్వం.. అధిష్ఠానానికి ఆయన ఒక్కడి పేరును మాత్రమే సిఫారసు చేసింది.