మందు బాబులూ ఈ లక్షణాలున్నాయా.. తస్మాత్ జాగ్రత్త!

ABN , First Publish Date - 2020-03-30T19:04:34+05:30 IST

లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణలో మద్యం దుకాణాలు అన్నీ మూసివేయబడ్డాయి.

మందు బాబులూ ఈ లక్షణాలున్నాయా.. తస్మాత్ జాగ్రత్త!

హైదరాబాద్ : లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణలో మద్యం దుకాణాలు అన్నీ మూసివేయబడ్డాయి. గత ఎనిమిదిరోజులుగా మద్యం దొరక్కపోవడంతో మందుబాబులు తెగ ఇబ్బందిపడిపోతున్నారు!. దీంతో కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. మరికొందరేమో ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న వాళ్లతో నగరంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా.. మల్కాజిగిరి జిల్లా హాస్పిటల్‌లో 2రోజుల వ్యవధిలో సుమారు 15 కేసులు నమోదయ్యాయి. మతిస్థిమితం కోల్పోవడంతోనే మందుబాబులు ఆస్పత్రల్లో చేరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 


విచిత్ర ప్రవర్తన..

2 రోజుల వ్యవధిలో మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రికి సుమారు 15మంది రోగులు చికిస్త కోసం వచ్చారు. మద్యం దొరక్క మతిస్థిమితం కోల్పోతున్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో మద్యం దొరక్కపోవడంతో చాలా మంది మందుబాబులు విచిత్ర ప్రవర్తన చేస్తున్నారు అని డాక్టర్లు తెలుపుతున్నారు.


వెంటనే సంప్రదించండి!

ఇదే విషయమై సైక్రాటిస్ట్ ఆశా మౌనిక మీడియాతో మాట్లాడుతూ.. నిత్యం మద్యం అలవాటున్న ఉన్న వ్యక్తులకు ఒక్కసారిగా దొరక్కపోవడం వల్ల అసాధారణంగా ప్రవర్తిస్తారని చెప్పుకొచ్చారు. కొందరికి శరీరంలో విపరీతమైన వొణుకు వస్తుందని దీన్నే ఆల్కాహాల్ విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అంటారని తెలిపారు. మొదటి దశలో శరీరంలో విపరీతమైన వణుకు వస్తుందని.. ఆ తర్వాత ఇలాంటి వారికి ఫిట్స్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్ తెలిపారు. ఇదే ముదిరి రోగి పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తారన్నారు. ఆత్మహత్య చేసుకోవడం, ఇతరులను గాయపర్చడం, వారికి వారే గాయపర్చుకోవడం లాంటివి చేస్తారని మౌనిక తెలిపారు. ఇటువంటి లక్షణాలు ఉన్న వారు తక్షణమే డాక్టర్‌ని సంప్రదించాలని సైక్రాటిస్ట్ మందుబాబులకు సూచించారు.

Updated Date - 2020-03-30T19:04:34+05:30 IST