ఆర్టీసీ బస్సును బార్‌గా మార్చిన ఆకతాయిలు
ABN , First Publish Date - 2020-12-11T22:38:51+05:30 IST
ఆర్టీసీ బస్సును ఆకతాయిలు బార్‌గా మార్చేశారు. బస్సులో మద్యం సేవిస్తూ విసిగించారు. ఇతర ప్రయాణికులు ఉన్నారన్న..
మంచిర్యాల: ఆర్టీసీ బస్సును ఆకతాయిలు బార్‌గా మార్చేశారు. బస్సులో మద్యం సేవిస్తూ విసిగించారు. ఇతర ప్రయాణికులు ఉన్నారన్న స్పృహ లేకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. మంచిర్యాల నుంచి ఆసీఫాబాద్ వెళ్తున్న బస్సులో ఈ ఘటన జరిగింది. మంచిర్యాలలో ఐదుగురు యువకులు బస్సు ఎక్కారు. ఎక్కిన వెంటనే తమతో పాటు తెచ్చుకున్న బీర్ బాటిల్స్‌ను ఓపెన్ చేసి తాగడం మొదలుపెట్టారు. పైగా అరుపులు, కేకలతో హంగామా చేశారు. డ్రైవర్, కండక్టర్లతో పాటు ఇతర ప్రయాణికులు సర్ది చెప్పినా వినలేదు. వారిపైనా దురుసుగా ప్రవర్తించారు.