హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్‌ రాకెట్‌

ABN , First Publish Date - 2020-06-22T09:28:10+05:30 IST

రాజధానిలో మరో సారి డ్రగ్స్‌ కలకలం చెలరేగింది. డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ..

హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్‌ రాకెట్‌

ముగ్గురి అరెస్టు


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాజధానిలో మరో సారి డ్రగ్స్‌ కలకలం చెలరేగింది. డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం రట్టు చేసింది. ముగ్గురిని అదుపులోకి తీసుకొని, భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో ఆరుగురి కోసం గాలిస్తోంది. అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ అంజిరెడ్డి ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారంతో అమీర్‌పేట, మధురానగర్‌ ప్రాంతంలో ఎరుపు రంగు రెనో కారు(ఏపీ16ఎ్‌ఫజె8030)ను ఆపి తనిఖీలు చేయగా 25గ్రాముల కొకైన్‌, 73గ్రాముల ఎండీఎంఏ (స్టోన్‌), 32గ్రాముల ఎండీఎంఏ (క్రిస్టల్‌), 25గ్రాముల హషీష్‌ ఆయిల్‌, 4ఎల్‌ఎ్‌సడీ బ్లోట్స్‌, 250గ్రాముల గంజాయి లభ్యమయ్యాయి.


కారులో ఉన్న మధురానగర్‌కు చెందిన భరత్‌ ఠుక్రాల్‌(48), బల్కంపేట నివాసి ఎం.రాణాప్రతాప్‌(29), బంజారాహిల్స్‌కు చెందిన షేక్‌ అబ్దుల్‌ హమీద్‌(29)ను ఎక్సైజ్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. ఇతర నగరాల నుంచి మాదకద్రవ్యాలు సేకరించి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. ఇంకా వారి వద్ద నుంచి 6ఎంఎల్‌ నీడిల్‌ సిరంజీలు-18, 5ఎంఎల్‌ స్టెరిలైజ్డ్‌ వాటర్‌ యాంపిల్స్‌-9, డిజిటల్‌ వెయింగ్‌ యంత్రాలు-2, ఖాళీ సాచెట్లు, 7 సెల్‌ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, బోరబండకు చెందిన అఖిల్‌ ఆదిత్య వద్ద హషీష్‌ ఆయిల్‌, లంగర్‌హౌ్‌సకు చెందిన భరత్‌సింగ్‌ వద్ద గంజాయి, బెంగళూరుకు చెందిన జేమ్స్‌, ఢిల్లీ నివాసి జేమీ, చెన్నైకు చెందిన ఇర్ఫాన్‌, అబ్దుల్‌ వద్ద కొకైన్‌, ఎండీఎంఏ డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు ప్రధాన నిందితుడు భరత్‌ ఠుక్రాల్‌ అంగీకరించినట్లు అంజిరెడ్డి తెలిపారు. ఈమేరకు వారందరి కోసం గాలింపు ప్రారంభించామన్నారు.  

Updated Date - 2020-06-22T09:28:10+05:30 IST