డ్రగ్స్‌ కేసులో కీలక విషయాలు

ABN , First Publish Date - 2020-06-04T05:30:00+05:30 IST

డ్రగ్స్‌ కేసులో ఎక్సైజ్‌ అధికారులు కీలక విషయాలు గుర్తించారు. హైదరాబాద్‌లో పాత కస్టమర్లకు డ్రగ్స్‌ సరఫరా చేసేందుకే

డ్రగ్స్‌ కేసులో కీలక విషయాలు

హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో ఎక్సైజ్‌ అధికారులు కీలక విషయాలు గుర్తించారు. హైదరాబాద్‌లో పాత కస్టమర్లకు డ్రగ్స్‌ సరఫరా చేసేందుకే.. కొత్త వ్యక్తులను డ్రగ్స్‌ మాఫియా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. పట్టుబడ్డ ఇద్దర్ని విచారించగా మొత్తం 22 మందితో సంబంధం ఉన్నట్లు వివరాలు సేకరించారు. ప్రాథమిక చార్జిషీట్‌లో 22 మందిని నిందితులుగా పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిందితులపై సెక్షన్‌ 8సీ, ఆర్‌/డబ్ల్యూ 216, 17ఏ, 27 ఏ&బీ ఎండీపీఎస్‌ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేశారు. బెంగళూరులో డ్రగ్స్‌ సప్లై చేసిన మైక్‌తో పాటు.. మైక్‌కు డ్రగ్స్‌ సప్లై చేసిన వారిపై కూడా అధికారులు నిఘా ఉంచారు. 

Updated Date - 2020-06-04T05:30:00+05:30 IST