హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్‌ కలకలం

ABN , First Publish Date - 2020-07-20T09:30:09+05:30 IST

వేర్వేరు మార్గాల ద్వారా హైదరాబాద్‌ నగరానికి కొకైన్‌ తీసుకొచ్చి విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన ఓ జంటను హైదరాబాద్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌

హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్‌ కలకలం

  • నైజీరియన్‌ జంట అరెస్టు..
  • కొకైన్‌, రూ.1.64 లక్షల స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): వేర్వేరు మార్గాల ద్వారా హైదరాబాద్‌ నగరానికి కొకైన్‌ తీసుకొచ్చి విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన ఓ జంటను హైదరాబాద్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్టు చేశారు. నిందితులు తార్నాకలో నాలుగు రోజుల క్రితం ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. నగరంలోని తార్నాక, గచ్చిబౌలి, సికింద్రాబాద్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో ఈ జంట రూ.8 వేలకు గ్రాము కొకైన్‌ను విక్రయించింది. కొకైన్‌ దందా ఆనవాళ్లు మళ్లీ కనిపిస్తున్నాయన్న సమాచారం అందుకున్న అధికారులు ఆదివారం తార్నాక వద్ద బైక్‌పై వెళ్తున్న నైజీరియన్‌ జంటను అడ్డుకున్నారు. వారిని తనిఖీ చేయగా 104 గ్రాముల కొకైన్‌ లభించింది. నిందితులను జిడియోఫర్‌ (35) అలియాస్‌ జైదీ పాస్కల్‌, అతని గర్ల్‌ఫ్రెండ్‌ చుకువుడి ఎబెరా మోనిక (30) గా గుర్తించారు. వారి వద్ద నుంచి కొకైన్‌తో పాటు రూ.1.64 లక్షల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, ఓ బైకును స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2020-07-20T09:30:09+05:30 IST