అద్దం చెప్పే అబద్ధం..
ABN , First Publish Date - 2020-09-18T21:50:35+05:30 IST
డ్రగ్స్ వ్యవహారం అటు బాలీవుడ్‌ను, ఇటు శాండిల్ వుడ్‌ను కుదిపేస్తోంది.

హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారం అటు బాలీవుడ్‌ను, ఇటు శాండిల్ వుడ్‌ను కుదిపేస్తోంది. అక్కడ డ్రగ్స్ కోణంలో విచారణ ముమ్మరమైంది. తీగ లాగితే రోజుకో డొంక కదులుతోంది. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పేర్లు గుబులు పుట్టిస్తున్నాయి. అయితే సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకం సాధారణమైందన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి.
ఫిలిం ఇండస్ట్రీలో డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరించడానికి కారణాలేంటి? డ్రగ్స్ వాడకంలో ఎక్స్‌స్ట్రా గ్లామర్ వస్తుందా? కొందరు తారల తళుకుల వెనక అడ్డదారులే ఉన్నాయా? రోజూ ఫిట్ నెస్ వీడియోలతో హోరెత్తించే..గ్లామర్ తారల అసలు సీక్రెట్ ఏంటి? ఇవే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ తీసుకుంటే వచ్చే కిక్కే వేరని అలవాటు పడినవారు అంటున్నారు. డ్రగ్స్ తీసుకుంటే ఎనర్జీ లెవెల్ పెరుగుతానేవారూ ఉన్నారు. అయితే నిపుణులు మాత్రం డ్రగ్స్ దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అనేక అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక చర్చ.. లైవ్‌లో చూడండి...