ఆర్టీయే కార్యాలయానికి వెళ్లకుండానే.. డ్రైవింగ్ లైసెన్సు పునరుద్ధరణ
ABN , First Publish Date - 2020-09-14T08:39:08+05:30 IST
ఇల్లు మారితే డ్రైవింగ్ లైసెన్సులో చిరునామాను మార్చడం ఇప్పటి వరకు ఓ భారీ ప్రక్రియగా ఉండేది. ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవడం.. నిర్ణీత తేదీ, సమయానికి దగ్గర్లోని ఆర్టీయే కార్యాలయానికి
- చిరునామానూ మార్చుకోవచ్చు
- అందుబాటులో మరో 8 సేవలు
- కాంటాక్ట్‌లెస్ సర్వీసుల్లో..
- రవాణా శాఖ మరో ముందడుగు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఇల్లు మారితే డ్రైవింగ్ లైసెన్సులో చిరునామాను మార్చడం ఇప్పటి వరకు ఓ భారీ ప్రక్రియగా ఉండేది. ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవడం.. నిర్ణీత తేదీ, సమయానికి దగ్గర్లోని ఆర్టీయే కార్యాలయానికి వెళ్లడం.. అక్కడ దళారుల బేరసారాలు.. చివరికి ఫొటో దిగి, డిజిటల్ సంతకం పెట్టడం.. స్మార్ట్‌కార్డుల కొరత ఉంటే.. డ్రైవింగ్ లైసెన్సు పోస్టులో ఇంటికి రావడానికి వారాలు, నెలలు ఎదురుచూడడం.. ఇవీ ప్రస్తుతం రవాణా సేవలకు ఒక సగటు వాహనదారుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులు. ఇకపై అలాంటి తిప్పలుండవు. టీ-యా్‌ప-ఫోలియో మొబైల్ యాప్‌లో లాగిన్ అయ్యి.. కొత్త చిరునామా వివరాలు నమోదు చేసి, నిర్ణీత ఫీజు చెల్లిస్తే చాలు. అవసరం మేరకు మొబైల్ ఫోన్ నుంచే తాజా ఫొటోను, డిజిటల్ సంతకాన్ని అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. రవాణా శాఖకు వెళ్లకుండానే.. అడ్రస్ మార్పుతో కొత్త డ్రైవింగ్ లైసెన్సు ఇంటికి వచ్చేస్తుంది. ఇలాంటివి మరో 9 సేవలు మొబైల్ యాప్‌లో అందుబాటులోకి వచ్చినట్లు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. త్వరలో రవాణా శాఖ వెబ్‌సైట్‌లో కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ నిర్ణయం వల్ల.. వాహనదారులపైన, అధికారులు, సిబ్బందిపైనా భారం తగ్గుతుందని, కరోనా కల్లోలం నేపథ్యంలో వైరస్ కట్టడికి ఈ నిర్ణయం దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇంట్లో కూర్చొనే.. ఈ సేవలను పొందవచ్చు
డూప్లికేట్ లెర్నర్స్ లైసెన్స్
డూప్లికేట్ లైసెన్స్
డ్రైవింగ్ లైసెన్సు బ్యాడ్జి(రవాణా వాహనాల కోసం)
స్మార్ట్ కార్డు(పాత పీవీసీ కార్డు లైసెన్స్ స్థానంలో కొత్తది తీసుకోవడం)
లైసెన్స్ హిస్టరీ షీట్
డైవ్రింగ్ లైసెన్స్ పునరుద్ధరణ (రెన్యూవల్)
డైవ్రింగ్ లైసెన్స్‌లో చిరునామా మార్పు
ప్రమాదకర లైసెన్స్‌ను ఆమోదించడం
గడువు ముగిసిన లెర్నర్స్ లైసెన్స్ స్థానంలో.. కొత్త లెర్నర్స్ లైసెన్స్ తీసుకోవడం.. వాహన తరగతిని చేర్చడం
గడువు ముగిసిన డైవ్రింగ్ లైసెన్స్‌లకు లెర్నర్స్‌లైసెన్స్ జారీ