పోలింగ్ ముగియగానే బారులు తీరిన మందుబాబులు

ABN , First Publish Date - 2020-12-02T00:23:06+05:30 IST

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ఇలా ముగిసిందో లేదో జనాలు వైన్ షాపులు, బార్ల ముందు బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు లేక బోసిపోయిన గ్రేటర్ హైదరాబాద్ నగరం.. వైన్ షాపులు, బార్ల వద్ద మాత్రం బారులు తీరిన జనాలతో కలకలలాడుతోంది.

పోలింగ్ ముగియగానే బారులు తీరిన మందుబాబులు

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ఇలా ముగిసిందో లేదో జనాలు వైన్ షాపులు, బార్ల ముందు బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు లేక బోసిపోయిన గ్రేటర్ హైదరాబాద్ నగరం.. వైన్ షాపులు, బార్ల వద్ద మాత్రం బారులు తీరిన జనాలతో కలకలలాడుతోంది. ఓటేయడానికి ముందుకు రాని జనాలు.. మద్యం కోసం 6 గంటలకు ముందే వైన్ షాపుల ముందు క్యూ కట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో జోక్స్ పేలుతున్నాయి. ఈ రోజు జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో కంటే భారీగా పోలింగ్ శాతం పడిపోయింది. ఓటు వేయడానికి చాలా మంది ఆసక్తి చూపకపోవడం బాధ్యతారాహిత్యమేనని అంటున్నారు. మరోవైపు కరోనా సెకెండ్ వేవ్ వల్ల కూడా భయపడి కొంతమంది ఓటేయడానికి రాలేదని తెలుస్తోంది.


ఫొటోల కోసం క్లిక్ చేయండి

Updated Date - 2020-12-02T00:23:06+05:30 IST