మద్యం మత్తులో ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకుని యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-05-11T09:08:18+05:30 IST

మద్యం మత్తులో ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకొన్న ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఉదంతమిది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో...

మద్యం మత్తులో ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకుని యువకుడి మృతి

కోరుట్ల, మే 10: మద్యం మత్తులో ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకొన్న ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఉదంతమిది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది. ఏపీలోని ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం వెంగళపూర్‌కు చెందిన సుబ్బారాయుడు (28) కోరుట్లలో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం అతడు బాగా మద్యం తాగాడు. అనంతరం పట్టణంలోని ఐబీ రోడ్డులో వాహన చోదకులను ఇబ్బందులకు గురిచేశాడు. రోడ్డుపై బండరాళ్లను విసురుతూ బీభత్సం సృష్టించాడు. అనంతరం రోడ్డు పక్కన ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఉన్న ఫ్యూజ్‌ బోర్డును పట్టుకుని విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.

Updated Date - 2020-05-11T09:08:18+05:30 IST