39 వేల ‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణం పూర్తి

ABN , First Publish Date - 2020-03-13T09:48:27+05:30 IST

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా చేపడుతున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 2.89 లక్షల ఇళ్లు మంజూరు చేయగా..

39 వేల ‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణం పూర్తి

1.16 లక్షల ఇళ్లలో మిగిలిన చిన్న పనులు

రెండేళ్లుగా అందని కేంద్రం నిధులు: వేముల


హైదరాబాద్‌, మార్చి 12(ఆంధ్రజ్యోతి): డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా చేపడుతున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 2.89 లక్షల ఇళ్లు మంజూరు చేయగా.. 1.99 లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. వీటిలో 39,321 ఇళ్లు పూర్తి చేశామని, మరో 1.16 లక్షల ఇళ్లకు చిన్న పనులు మిగిలి ఉన్నాయని తెలిపారు.   మండలిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు ప్రశ్నోత్తరాల సమయంలో పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఇందుకు మంత్రి బదులిస్తూ.. ఇప్పటి వరకు కేంద్రం నుంచి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి రూ.1311 కోట్లు అందాయని, రాష్ట్ర ప్రభుత్వం రూ.6500 కోట్లు ఖర్చు చేసినట్లు జవాబిచ్చారు. షోషియో ఎకనామికల్‌ సర్వేలోని జాబితా, ఇతర కారణాలతో గత రెండేళ్లుగా కేంద్రం నుంచి నిధులు రాలేదని, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించుకుంటామని తెలిపారు. 

ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లలో మంజూరై పూర్తి కాని ఇళ్లపై రెవెన్యూ శాఖతో సర్వే చేయించామని, 1.3 లక్షల ఇళ్లు బోగస్‌ అని తేలిందని మంత్రి పేర్కొన్నారు. మిగిలిన 70 వేల ఇళ్లను పరిశీలిస్తున్నారని తెలిపారు. కాగా, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై సమాధానం చెబుతున్న సందర్భంలో మంత్రి వేముల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వడంపై ‘పేద వాళ్లకు అదే ఎక్కువ.. అదే గొప్ప’ అంటూ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-03-13T09:48:27+05:30 IST