50 డబుల్‌బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన హరీష్ రావు

ABN , First Publish Date - 2020-05-17T21:26:24+05:30 IST

ఇళ్లు లేని నిరుపేదలు ఆత్మ గౌరవంతో బతకాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్‌ రూం ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి హరీష్ రావు అన్నారు.

50 డబుల్‌బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన హరీష్ రావు

సిద్దిపేట: ఇళ్లు లేని నిరుపేదలు ఆత్మ గౌరవంతో బతకాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్‌ రూం ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట నియోజకవర్గంలోని రావురూకుల, తోర్నాల గ్రామాల్లో నిర్మించిన 50 డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నిరుపేదలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సకల వసతులతో ఇండ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. దేశంలో మరెక్కడా ఇలాంటి ఇళ్లు నిర్మించి ఇవ్వడం లేదన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. దశల వారీగా పేదలందరికీ డబుల్ బెడ్‌రూమ్స్ ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అమ్మితే నేరుగా జైలుకే పంపిస్తామని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గరీబోళ్ల ఇళ్ల నిర్మాణం కోసం కేవలం రూ.40వేలు మాత్రమే ఇచ్చేవారని అన్నారు. అవి బేస్మెంట్‌కు కూడా సరిపోయేవి కావన్నారు. ఇళ్లు పూర్తయ్యేసరికి ఆ ఇంటి యజమాని అప్పుల ఊబిలో కురుకుపోయేవాడని అన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పేదవారిపై భారం పడకుండా ఇళ్లు నిర్మించి, తాళాలు చేతిలో పెట్టి కొత్త ఇళ్లకు పంపిస్తోందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

Updated Date - 2020-05-17T21:26:24+05:30 IST