దోస్త్ నోటిఫికేషన్ విడుదల

ABN , First Publish Date - 2020-08-20T21:28:05+05:30 IST

హైదరాబాద్: ఇవాళ దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందని ఏబీఎన్‌తో దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు.

దోస్త్ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: ఇవాళ దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందని ఏబీఎన్‌తో దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. ఇంటర్ లేదా దానికి సమాన అర్హత ఉన్నవారు దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ పొందవచ్చన్నారు. దోస్త్ అడ్మిషన్ ప్రక్రియను చాలా సులభతరం చేశామన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు అడ్మిషన్ పొందవచ్చన్నారు. రిజస్ట్రేషన్‌లో ఉపయోగించిన ఫోన్ నెంబర్ అడ్మిషన్ పొందే వరకు ఉంచుకోవాలన్నారు. ఈ నెల 24నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. 3 ఫేజ్ లలో రిజస్ట్రేషన్ అక్టోబర్ 12 నాటికి పూర్తి అవుతుందన్నారు. ఆ తరవాత డిజిటల్ లేదా ఫిజికల్ క్లాసులు నిర్వహించే అవకాశం ఉందని లింబాద్రి తెలిపారు.

Updated Date - 2020-08-20T21:28:05+05:30 IST