పులి కనిపించిందంటూ పుకార్లు
ABN , First Publish Date - 2020-11-21T10:25:38+05:30 IST
మండలంలోని బూరుగుపాడు గ్రామంలోని చెరువు వద్ద శుక్రవారం గొర్రెలకాపరులకు పులి కన్పించిందని పుకార్లు రావడంతో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో

డోర్నకల్, నవంబరు 20: మండలంలోని బూరుగుపాడు గ్రామంలోని చెరువు వద్ద శుక్రవారం గొర్రెలకాపరులకు పులి కన్పించిందని పుకార్లు రావడంతో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం పోలీసు, అటవీ అధికారులకు సర్పంచ్ భర్త వెంకటరెడ్డి తెలుపడంతో ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు కిషన్‌రావు, జైసింగ్, బీట్ ఆఫీసర్ సూరిదాస్ అక్కడికి చేరుకున్నారు. గొర్రెలకాపరులకు పులి కనిపించిన చోటుకు వెళ్లి పులి ఆనవాళ్ల కోసం ఆరా తీశారు. పులి పాదముద్రల కోసం ఆ ప్రాంతంలో వెదికారు. ఇంతలో ఓ రైతు తమ పొలం వద్ద పులి పాదముద్రలు ఉన్నాయని తెలుపగా అక్కడికి వెళ్లిన అటవీ సిబ్బంది పాదముద్రలను పరిశీలించి అవి హైనాకు సంబంధించినవిగా తేల్చారు. దీంతో బూరుగుపాడు గ్రామస్థులు, రైతులు ఊపిరి పీల్చుకున్నారు. సీఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని అటవీ సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు.