మా నాన్న కోలుకుంటున్నారు.. వదంతులు పోస్ట్ చేయకండి: డాక్టర్ వరుణ్
ABN , First Publish Date - 2020-06-18T17:12:30+05:30 IST
వరంగల్: జిల్లాలోని హన్మకొండలో ప్రముఖ చర్మ వైద్య డాక్టర్ వీ.రమేష్ కరోనా వైరస్ వల్ల చనిపోయారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కుమారుడు డాక్టర్ వరుణ్ తప్పుబట్టారు.

వరంగల్: జిల్లాలోని హన్మకొండలో ప్రముఖ చర్మ వైద్య డాక్టర్ వీ.రమేష్ కరోనా వైరస్ వల్ల చనిపోయారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కుమారుడు డాక్టర్ వరుణ్ తప్పుబట్టారు. ఆయన చికిత్స పొందుతున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని ఒక వీడియో విడుదల చేశారు. తన తండ్రి చనిపోయాడని సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని, అలాంటి వదంతులను నమ్మవద్దని విజ్ణప్తి చేశారు.
ప్రస్తుతం తన తండ్రి చికిత్స పొందుతున్నారని త్వరలోనే కోలుకుంటారని వరుణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయమై డాక్టర్ రమేష్ సైతం ఓ వీడియో సందేశాన్ని ఇచ్చారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని తనపై వచ్చే వదంతులన్నీ అవాస్తవమని ఆసుపత్రి బెడ్ పై నుంచే వీడియో ద్వారా వ్యక్తం చేశారు. తాను తొందరలోనే కోలుకుంటానని, మళ్లీ తన విధులు నిర్వహిస్తానని డాక్టర్ రమేష్ పేర్కొన్నారు.