ఇళ్లనుంచి బయటకు రావొద్దు
ABN , First Publish Date - 2020-04-25T09:05:04+05:30 IST
లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని, ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని కలెక్టర్ హరిత, ఎమ్మెల్యే పెద్ది

నర్సంపేట, ఏప్రిల్ 24 : లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని, ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని కలెక్టర్ హరిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. శుక్రవారం స్థానిక రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో 24 వార్డుల్లో 7,200 కుటుంబాలకు పండ్ల వ్యాపారి కొలువుల రాజమౌళి సమకూర్చిన ద్రాక్ష, బత్తాయి పండ్లను వారు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాయిడి రవీందర్‌రెడ్డి, ఆర్డీవో హరిసింగ్, తహసీల్దార్ రాంమూర్తి, మునిసిపల్ చైర్‌పర్సన్ గుంటి రజని, కమిషనర్ విద్యాధర్ తదితరులు పాల్గొన్నారు.