ఆ ప్రచారాన్ని నమ్మొద్దు: ట్రాన్స్‌కో సీఎండీ
ABN , First Publish Date - 2020-03-24T18:54:30+05:30 IST
తెలంగాణలో లాక్‌డౌన్ కారణంగా కరెంటు కోతలు విధించబోతున్నారంటూ ..

హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్ కారణంగా కరెంటు కోతలు విధించబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఉత్పత్తికి ఎక్కడా ఆటంకాలు లేవన్నారు. అన్ని ప్లాంట్లు పనిచేస్తున్నాయని, ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోరినట్లు కరోనా నియంత్రణకు ప్రజలందరూ కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దని ప్రభాకర్‌రావు విజ్ఞప్తి చేశారు.