కరోనాపై పోరుకు... ప్రభుత్వానికి విరాళాలు

ABN , First Publish Date - 2020-06-16T20:51:38+05:30 IST

కరోనా వైరస్ నియంత్రణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అండగా నిలిచేందుకుగాను ముఖ్యమంత్రి సహాయ నిధికి వివిధ సంస్థలు విరాళాలనందించాయి.

కరోనాపై పోరుకు... ప్రభుత్వానికి విరాళాలు

హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అండగా నిలిచేందుకుగాను ముఖ్యమంత్రి సహాయ నిధికి వివిధ సంస్థలు విరాళాలనందించాయి. 


రాజధాని నగరమైన హైదరాబాద్ లోని ఫతేనగర్ స్టీల్ మర్చంట్స్ అసోసియేషన్ రూ. 8,51,000, శంతన్ బాగ్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అసోసియేషన్ రూ.1,50,000, సికింద్రాబాద్ లోని పుష్ప ట్రేడింగ్ కంపెనీ రూ. 1,00,000 లను విరాళంగా ఇచ్చాయి.


ఇందుకు సంబంధించిన చెక్కులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అందజేశారు.

Updated Date - 2020-06-16T20:51:38+05:30 IST