సీఎం సహాయనిధికి రూ.8.72 కోట్లు

ABN , First Publish Date - 2020-04-01T08:48:22+05:30 IST

కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలకు చేయూత అందించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి, సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు

సీఎం సహాయనిధికి రూ.8.72 కోట్లు

మంత్రి కేటీఆర్‌కు పారిశ్రామికవేత్తల విరాళాలు

రూ.5 కోట్లు అందించిన దివీస్‌

గ్రాన్యూల్స్‌ ఇండియా, విర్కో పెట్రో కెమికల్స్‌ చెరో కోటి


హైదరాబాద్‌ సిటీ/పంజాగుట్ట/బంజారాహిల్స్‌/చౌటుప్పల్‌, మార్చి31 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలకు చేయూత అందించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి, సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు అందజేశారు. దివీస్‌ లేబొరేటరీస్‌ రూ.5 కోట్లు, గ్రాన్యూల్స్‌ ఇండియా రూ. కోటి, విర్కో పెట్రో కెమికల్స్‌ రూ.కోటి, ఐఆర్‌ఏ రియాల్టీ టెక్నాలజీ రూ. 25 లక్షలు, సుచిర్‌ ఇండియా రూ.25 లక్షలు, ఎంజీబీ కమొడిటీస్‌  రూ.20 లక్షలు, మానవీయ డెవల్‌పమెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ రూ.20లక్షలు, సాయిసూర్య డెవలపర్స్‌ రూ.10 లక్షలు అందజేశాయి.


మంగళవారం మొత్తం రూ.8.72 కోట్ల విరాళాలు అందాయని అధికారవర్గాలు తెలిపాయి. సమాజం ఆపత్కాలంలో ఉన్నప్పుడు ప్రభుత్వంతో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చిన కంపెనీలు, పారిశ్రామిక వేత్తలకు మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. స్వర్గసీమ శాండల్‌వుడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ చండ్ర చంద్రశేఖర్‌ ఏపీ సహాయ నిధికి రూ.లక్ష, తెలంగాణకు రూ.2 లక్షలు చొప్పున అందజేశారు. దీంతోపాటు వరంగల్‌ గ్రానైట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ రూ.5 లక్షలు, తెలంగాణ అర్చక సంఘం రూ.లక్ష విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాయి. ఈ చెక్కులను మంగళవారం గ్రామీణాభివృద్థి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకి మంగళవారం వరంగల్‌లో అందజేశారు.

Updated Date - 2020-04-01T08:48:22+05:30 IST