విరివిగా విరాళాలు.. సీఎంఆర్‌ఎఫ్‌కు అందజేత

ABN , First Publish Date - 2020-04-07T09:51:00+05:30 IST

కరోనా నివారణ చర్యలకు మద్దతుగా ప్రముఖులు, సంస్థలు, సంఘాల నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎ్‌ఫ)కి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన

విరివిగా విరాళాలు.. సీఎంఆర్‌ఎఫ్‌కు అందజేత

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): కరోనా నివారణ  చర్యలకు మద్దతుగా ప్రముఖులు, సంస్థలు, సంఘాల నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎ్‌ఫ)కి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన చెక్కులను అందజేసినవారి వివరాలు..

  • ఐకేపీ వీవోఏ సంఘం తరఫున రూ.1.72 కోట్లు, తెలంగాణ పౌలీ్ట్ర అసోసియేషన్‌ రూ.కోటి, తెలంగాణ బ్రీడర్స్‌ అసోసియేషన్‌ రూ.కోటి, యూనిక్‌ ట్రీస్‌ రూ.25 లక్షలు, టెస్కాబ్‌ తరఫున రూ.కోటి, ‘గుడ్‌ సమరిటాన్స్‌ ఆఫ్‌ ఖమ్మం’ రూ.2 కోట్లు, అనూష ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.50 లక్షలు, డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.50 లక్షలు, కేపీసీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ రూ.50 లక్షలు, ఎస్‌ఎల్‌ఎంఐ ఇన్‌ ఫ్రా ప్రాజెక్ట్స్‌ రూ.25 లక్షలు, శ్రీ వెంకటేశ్వర కన్‌స్ట్రక్షన్స్‌ రూ.25 లక్షలు, సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ రూ.25 లక్షల విలువైన చెక్కులను అందించారు.
  • రెడ్డీస్‌ ల్యాబ్‌.. రూ.5 కోట్ల విలువైన మందులు, ఎన్‌-95 మాస్క్‌లు ఎంఎ్‌సఎన్‌ ల్యాబ్స్‌.. రూ.5 కోట్ల విలువైన మందులు, వైద్య సామగ్రి ఇవ్వనున్నట్లు తెలిపాయి.
  • జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు చెందిన ఆరుగురు కాంట్రాక్టర్లు రూ.2.25 కోట్లు ఇచ్చారు.


కేటీఆర్‌కు చెక్కులు అందించిన పలువురు

  • జీవీకే బయో కంపెనీ వైస్‌ చైర్మన్‌ సంజయ్‌రెడ్డి రూ.5 కోట్లు, సాగర్‌ సిమెంట్స్‌, వెల్జన్‌ దేనిజన్స్‌, రహేజా కార్పొరేట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ రూ.కోటి, ఆదిత్య హోమ్స్‌, తెలంగాణ స్టేట్‌ ఆయిల్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌, హైదరాబాద్‌ ఆర్చ్‌ డైకొసిస్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ, రూ.50 లక్షల విలువైన చెక్కులను కేటీఆర్‌కు అందజేశారు.
  • కాకినాడ పోర్టు ఛైర్మన్‌ కేవీ రావు రూ.50 లక్షల చెక్కును కూతురు శ్రేయ, బీసీసీఐ జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ చాముండేశ్వరినాథ్‌తో కలిసి కేటీఆర్‌కు అందజేశారు.
  • మంత్రి తలసానితో కలిసి వ్యాపార సంస్థల ప్రతినిధులు రూ.2.43 కోట్ల చెక్కులను కేటీఆర్‌కు ఇచ్చారు.
  • జెక్‌ కాలనీ సంక్షేమ సంఘం రూ.63 లక్షలు, ఆదిత్య మ్యూజిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ. 31 లక్షలు, వరంగల్‌ ఏకశిల సొసైటీ తరపున రూ.25 లక్షలు, గ్రీన్‌ సిటీ ఎస్టేట్స్‌, సూర్య శంకర్‌రెడ్డి గుండేటి, నిజాం క్లబ్‌ రూ.15 లక్షలు, సాకేత ఇంజనీరింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌, శ్రీ వెంకటేశ్‌ గ్రానైట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ధనలక్ష్మి ఐరన్‌ ఇండస్ర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కేఎంవీ ప్రాజెక్టు లిమిటెడ్‌, హారిక, హాసిని క్రియేషన్స్‌, ఎ.శ్రీనివాస్‌, జయరాజ్‌ ఇస్పాత్‌ లిమిటెడ్‌, దేవశ్రీ ఇస్పాత్‌ లిమిటెడ్‌, జింఖానా క్లబ్‌, నవతేజ్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌, ఆర్బీవీఆర్‌ రెడ్డి, ఎడ్యుకేషన్‌ సొసైటీ, వీరమణి బిస్కెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, డాల్ఫిన్‌ ఫుడ్‌, సంజీవన్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ రూ.10 లక్షల వంతున ఇచ్చాయి.
  • కిట్స్‌ వరంగల్‌ ఉద్యోగులు రూ.7.78 లక్షలు, మనోహర ఎడ్యుకేషన్‌ సొసైటీ, వీఎంఆర్‌ పాలిటెక్నిక్‌ రూ.5 లక్షలు, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దామోదర్‌ రూ.10 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.
  • సాగర్‌ సిమెంట్స్‌ గ్రూప్‌ రెండు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి రూ.కోటి విరాళం ప్రకటించింది. 
  • వీరమణి బిస్కట్స్‌ ఇండస్ట్రీస్‌, డాల్ఫిన్‌ ఫుడ్స్‌, అనై నవమణి ట్రస్ట్‌ రూ.25 లక్షలు విరాళం ఇవ్వగా, రాజేశ్వర కన్‌స్ట్రక్షన్స్‌ డెవల్‌పమెంట్‌, ఎస్‌ఆర్‌కే కేబుల్‌ నెట్‌వర్క్స్‌ రూ.5 లక్షలు ప్రకటించింది. ఐదు లక్షల కోడిగుడ్ల సరఫరాకు శ్రీనివాస హేచరీస్‌ ముందుకొచ్చాయి.
  • పీఎం కేర్స్‌కు న్యూక్లియర్‌ ఫ్యుయెల్‌ కాంప్లెక్స్‌ ఉద్యోగులు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. 
  • మేఘా సంస్థ మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ.2 కోట్లు ఇవ్వన్నుట్లు తెలిపింది.
  • బ్రహ్మకుమారీస్‌ 10 క్వింటాళ్ల బియ్యం, క్వింటా కందిపప్పును డీజీపీ మహేందర్‌రెడ్డికి అందజేశారు.

కృష్టంరాజు రూ.10లక్షల విరాళం

సీనియర్‌ నటుడు కృష్ణంరాజు కుటుంబం ప్రధానమంత్రి సహాయనిధికి రూ.10 లక్షలు విరాళం ప్రకటించింది. ‘మా’ అధ్యక్షుడు వీకే నరేశ్‌ 100 కుటుంబాల దత్తతకు ముందుకొచ్చారు. సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ సీసీసీకి రూ.3 లక్షలు విరాళం ప్రకటించారు. హీరో గోపీచంద్‌ వెయ్యిపైగా కుటుంబాలకు నెల సరుకులను అందజేశారు.


‘పీఎం కేర్‌’కు గవర్నర్‌ రూ.5 లక్షల విరాళం

పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ.5 లక్షల విరాళం ఇవ్వాలని తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్ణయించారు. దేశంలో కరోనా తగ్గేవరకు వేతనంలో 30 శాతం తగ్గించుకోవాలని నిర్ణయించారు. అలా మిగిలే రూ.1.05 లక్షలనూ విరాళంగా ఇవ్వనున్నట్లు సోమవారం రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ రాశారు.

Updated Date - 2020-04-07T09:51:00+05:30 IST