సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు తెలంగాణ డాక్యుమెంట్‌ రైటర్స్‌ విరాళం

ABN , First Publish Date - 2020-05-17T23:54:11+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం కరోనాని ఎదుర్కోవడంలో చేస్తున్న కృషికి తమ వంతు బాధ్యతగా తెలంగాణ డాక్యుమెంట్‌ రైటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ 4లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు తెలంగాణ డాక్యుమెంట్‌ రైటర్స్‌ విరాళం

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కరోనాని ఎదుర్కోవడంలో చేస్తున్న కృషికి తమ వంతు బాధ్యతగా తెలంగాణ డాక్యుమెంట్‌ రైటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ 4లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు నేతృత్వంలో, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో అసోసియేషన్‌ సభ్యులు కలిసి ప్రగతిభవన్‌లో ఐటి, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. ఈసందర్భంగా మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లిదయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ డాక్యుమెంట్‌ రైటర్స్‌ అసోసియేషన్‌ విరాళం ఇవ్వడాన్ని మంత్రి కేటీఆర్‌తో పాటు ఎర్రబెల్లి, జగదీశ్‌రెడ్డిఅభినంధించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డాక్యుమెంట్‌ రైటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తేళ్ల శివనాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పొరెడ్డి రవీందర్‌రెడ్డి కోశాధికారి మురళీ కృష్ణమాచారి తదతరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-17T23:54:11+05:30 IST