2న రక్తదానం చేయండి: బాలకృష్ణ
ABN , First Publish Date - 2020-10-01T23:50:56+05:30 IST
గాంధీ జయంతి సందర్భంగా ఈనెల 2న ఎన్టీఆర్ ట్రస్టు, తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరంలో అభిమానులు, కార్యకర్తలు
హైదరాబాద్: గాంధీ జయంతి సందర్భంగా ఈనెల 2న ఎన్టీఆర్ ట్రస్టు, తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరంలో అభిమానులు, కార్యకర్తలు, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని రక్తదానం చేయాలని ఎమ్మెల్యే ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. కృత్రిమ రక్తం తయారు చేయడం సాధ్యం కాదని, రక్తదానమే దీనికి పరిష్కారమని అందుకే తలసేమియా బాధితుల కోసం ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.