పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి..ఉప్పల్‌లో ఆందోళన

ABN , First Publish Date - 2020-12-15T18:34:46+05:30 IST

రాష్ట్రంలో పలుచోట్ల రిజిస్ట్రేషన్ల సమస్యలపై నిరసనలు కొనసాగుతున్నాయి.

పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి..ఉప్పల్‌లో ఆందోళన

హైదరాబాద్: రాష్ట్రంలో పలుచోట్ల రిజిస్ట్రేషన్ల సమస్యలపై నిరసనలు కొనసాగుతున్నాయి. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలంటూ ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు డాక్యుమెంట్స్ అండ్ రైటర్స్ ఫెడరేషన్ ఆందోళనకు దిగింది. అటు కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నెమ్మదిగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. సర్వర్లు మొరాయిస్తున్నాయి. దీంతో స్లాట్ బుకింగ్ జరగడంలేదు. ధరణి బుకింగ్‌లను రద్దు చేయాలని, అలాగే ఎల్ఆర్ఎస్‌ లేని ప్లాట్లని కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  

Updated Date - 2020-12-15T18:34:46+05:30 IST