కరోనా భయంతో ఆరుగురు వైద్యుల రాజీనామా!

ABN , First Publish Date - 2020-04-05T08:22:53+05:30 IST

కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో పనిచేసే ఆరుగురు కాంట్రాక్ట్‌ వైద్యులు శనివారం రాజీనామా చేశారు. వారిలో ఇద్దరు ఫిజీషియన్‌లు, ఇద్దరు పర్మనాలజి్‌స్టలు, ఓ అనస్తీషియన్‌, ఓ పిల్లల వైద్యుడు...

కరోనా భయంతో ఆరుగురు వైద్యుల రాజీనామా!

 కామారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 4: కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో పనిచేసే ఆరుగురు కాంట్రాక్ట్‌ వైద్యులు శనివారం రాజీనామా చేశారు. వారిలో ఇద్దరు ఫిజీషియన్‌లు, ఇద్దరు పర్మనాలజి్‌స్టలు, ఓ అనస్తీషియన్‌, ఓ పిల్లల వైద్యుడు ఉన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రైవేట్‌ ఆసుపత్రులు మూతపడడంతో.. నిత్యం వందల సంఖ్యలో రోగులు ఈ ఆసుపత్రికి వస్తున్నారు. దీంతో వీరిపై పని ఒత్తిడి పెరిగిపోయింది. వీరి రాజీనామాకు అది ఓ కారణమైతే.. ఆస్పత్రికి వచ్చే రోగులలో ఎవరికైనా కరోనా ఉంటే.. అది తమకు కూడా సోకుతుందేమోననే భయం మరో కారణమని సమాచారం.


Updated Date - 2020-04-05T08:22:53+05:30 IST