ఆన్‌లైన్‌లో వైద్యుల సలహా

ABN , First Publish Date - 2020-03-25T09:35:22+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రమవుతున్న సమయంలో సాధారణ రోగులకు యశోద ఆస్పత్రి ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభించింది. రోగుల సౌకర్యార్ధం ‘ఆన్‌లైన్‌

ఆన్‌లైన్‌లో వైద్యుల సలహా

సాధారణ రోగులకు యశోద సదుపాయం

‘ఆన్‌లైన్‌ వీడియో డాక్టర్‌ కన్సల్టేషన్‌’ ద్వారా  సూచనలు 

యశోద ఎండీ జీఎస్‌ రావు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రమవుతున్న సమయంలో సాధారణ రోగులకు యశోద ఆస్పత్రి ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభించింది. రోగుల సౌకర్యార్ధం ‘ఆన్‌లైన్‌ వీడియో డాక్టర్‌ కన్సల్టేషన్‌’ సదుపాయాన్ని అందిస్తున్నట్లు యశోద గ్రూప్‌ హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ జీఎస్‌ రావు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో సురక్షితంగా ఉండాలని, అత్యవసర వైద్య సలహా కోసం తమ వైద్యులను సంప్రందించాలని ఆయన కోరారు. మధుమేహం, మూత్రపిండాలు, గుండె, ఇతర జబ్బులతో బాధపడుతున్న వారు ఆన్‌లైన్‌ వీడియో కన్సల్టేషన్‌ ద్వారా సంప్రదిస్తే తమ వైద్యులు సమీక్షించి అవసరమైన సూచనలు చేస్తారన్నారు. ఆరోగ్య అవసరాలకు నిరంతర మార్గనిర్దేశనం చేస్తారన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. కరోనా వైరస్‌ విజృంభణ దృష్ట్యా ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దని, తప్పని సరి పరిస్థితిల్లోనే  అవసరమైతేనే బయటకు రావాలని ఆయన సూచించారు.

Updated Date - 2020-03-25T09:35:22+05:30 IST