వైద్యుడి గైర్హాజరు.. పసికందు మృతి

ABN , First Publish Date - 2020-05-09T10:06:21+05:30 IST

వైద్యుడి గైర్హాజరు.. పసికందు మృతి

వైద్యుడి గైర్హాజరు.. పసికందు మృతి

నల్లగొండ అర్బన్‌, మే 8: మూడు రోజుల పసికందు ఒళ్లు జ్వరంతో కాలిపోతోంది. అందుబాటులో ఉండాల్సిన వైద్యుడు లేడు. సమయానికి వైద్యం అందని పసిగుడ్డు, తెల్లవార్లూ గుక్కపెట్టి ఏడ్చి, వెక్కిళ్లతో కన్నుమూసింది. ఈ హృదయ విదారక ఘటన నల్లగొండ జిల్లా ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్యకేంద్రంలో జరిగింది. పెద్దవూర మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన రమణకు బుధవారం సాయంత్రం మగ శిశువు జన్మించాడు. గురువారం రాత్రి పసిబిడ్డకు ఒక్కసారిగా ఒళ్లు వేడెక్కి ఏడుస్తుండటంతో ఆస్పత్రిలో విధుల్లో ఉన్న నర్సు వద్దకు తీసుకెళ్లారు. ఆ సమయానికి పిల్లల వైద్యుడు లేరని.. బిడ్డకు బాగానే ఉందంటూ ఆమె సర్దిచెప్పి పంపించేసింది. శుక్రవారం ఉదయం కూడా వైద్యుడు రాకపోవడంతో వైద్యసహాయం అందని పసివాడు.. వెక్కిళ్లతో ఏడుస్తూ కన్నుమూశాడు. 

Updated Date - 2020-05-09T10:06:21+05:30 IST