హైదరాబాద్‌లో డాక్టర్ కిడ్నాప్.. పోలీసుల గాలింపు

ABN , First Publish Date - 2020-10-28T01:51:04+05:30 IST

హిమాయత్‌సాగర్‌ దర్గా వద్ద డాక్టర్ హుసాన్‌ (57) కిడ్నాప్‌కు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకెళ్లారు. రాజేంద్రనగర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. కుటుంబ కలహాలు.. వ్యాపార లావాదేవీల కోణంలో పోలీసులు దర్యాప్తు

హైదరాబాద్‌లో డాక్టర్ కిడ్నాప్.. పోలీసుల గాలింపు

హైదరాబాద్‌: హిమాయత్‌సాగర్‌ దర్గా వద్ద డాక్టర్ హుసాన్‌ (57) కిడ్నాప్‌కు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకెళ్లారు. రాజేంద్రనగర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. కుటుంబ కలహాలు.. వ్యాపార లావాదేవీల కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ప్రత్యేక బృందాలు దర్యాప్తు మొదలుపెట్టాయి. మరోవైపు డాక్టర్ సెల్‌ఫోన్ కాల్ రికార్డింగ్‌ను దర్యాప్తు బృందం పరిశీలిస్తోంది. కేసులో భాగంగా అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలిని సీపీ సజ్జనార్ పరిశీలించారు.



Updated Date - 2020-10-28T01:51:04+05:30 IST