ఎరువులను అధిక ధరలకు విక్రయించొద్దు

ABN , First Publish Date - 2020-07-27T11:39:55+05:30 IST

ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవయాసాధికారి ఉషాయాదల్‌ హెచ్చరించారు.

ఎరువులను అధిక ధరలకు విక్రయించొద్దు

భీమదేవరపల్లి, జూలై 26 : ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవయాసాధికారి ఉషాయాదల్‌ హెచ్చరించారు.  మండలంలోని ముల్కనూర్‌, ముత్తారం, కొత్తపల్లి, ముల్కనూర్‌ సొసైటీ ఎరువుల గోదాములను ఆదివారం ఆమె తనిఖీ చేశారు. డీలర్లు ఈ పాస్‌ మిషన్ల ద్వారానే అమ్మకాలు జరపాలని, క్రయ విక్రయాల రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. రైతులకు పంట, విస్తీర్ణం ఆధారంగానే ఎరువులను అమ్మాలని సూచిచారు. ఆమె వెంట ఏడీఏ దామోదర్‌రెడ్డి, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి వ్యవసాయాధికారులు రాజ్‌కుమార్‌, అఫ్జల్‌పాషా పాల్గొన్నారు.

Updated Date - 2020-07-27T11:39:55+05:30 IST