ధాన్యం కొనుగోళ్లకు ఆటంకం కలగొద్దు: సీఎం

ABN , First Publish Date - 2020-03-23T09:43:10+05:30 IST

రబీ సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ మేరకు

ధాన్యం కొనుగోళ్లకు ఆటంకం కలగొద్దు: సీఎం

హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): రబీ సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ మేరకు సోమవారం అత్యవసర సమీక్ష నిర్వహించి, విధి విధానాలు రూపొందించాలని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ఐకేపీ సెంటర్లు, పీఏసీఎ్‌సలు, మార్కెట్‌ కమిటీల ద్వారా గ్రామస్థాయిలోనే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. లక్ష టన్నుల వరకు వరి ధాన్యం కొనుగోలు చేయటానికి ఎఫ్‌సీఐ సిద్ధంగా ఉందని తెలిపారు. కాగా.. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి రబీ సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యాన్ని కొనుగోలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-03-23T09:43:10+05:30 IST