ప్రొటోకాల్ పాటించరా?
ABN , First Publish Date - 2020-12-15T07:45:20+05:30 IST
సిద్దిపేట, మెదక్ జిల్లాల కలెక్టర్ వెంకట్రామారెడ్డి ప్రతిపక్ష నేతల విషయంలో ప్రొటోకాల్ పాటించడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్‌రావు ఆరోపించారు.

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు
మెదక్ రూరల్, డిసెంబరు 14: సిద్దిపేట, మెదక్ జిల్లాల కలెక్టర్ వెంకట్రామారెడ్డి ప్రతిపక్ష నేతల విషయంలో ప్రొటోకాల్ పాటించడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్‌రావు ఆరోపించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేటకు వస్తే జిల్లా కలెక్టర్ ప్రొటోకాల్ పాటించలేదని అన్నారు.
అలాగే సోమవారం నిర్వహించిన మెదక్ జిల్లా పరిషత్ సమావేశానికి తొలిసారి వచ్చిన తనను సభ్యులకు పరిచయం చేయాలన్న కనీస బాధ్యతను జిల్లా యంత్రాంగం మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. జడ్పీ సమావేశం జరుగుతున్న తీరుసరిగా లేదని, చైర్‌పర్సన్‌ను మౌనంగా ఉంచి ఇతరులు సమావేశాన్ని హైజాక్ చేస్తున్నారని ఆరోపించారు. మొదటి సమావేశం కావడంతో నిరసన వ్యక్తం చేయడం లేదని, రాబోయే రోజుల్లో ఆదే విధానం కొనసాగితే తప్పకుండా అడ్డుకుంటామని రఘునందన్ హెచ్చరించారు.