మా గ్రామంలో మహారాష్ట్ర వారు అడుగుపెట్టొద్దు: హిప్నెల్లి వాసులు

ABN , First Publish Date - 2020-03-24T18:46:24+05:30 IST

మహారాష్ట్రలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా తానూర్ మండలం హిప్నెల్లీ గ్రామ వాసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

మా గ్రామంలో మహారాష్ట్ర వారు అడుగుపెట్టొద్దు: హిప్నెల్లి వాసులు

నిర్మల్: మహారాష్ట్రలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా తానూర్ మండలం హిప్నెల్లీ  గ్రామ వాసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామంలోకి మహారాష్ట్ర వారు ఎవరూ రాకూడదని గ్రామ పంచాయతీ  తీర్మానం చేసింది. గ్రామానికి వచ్చే రెండు రహదారులకు అడ్డుగా కట్టెలు వేసి బయటవారినెవ్వరినీ గ్రామంలోకి రానివ్వకుండా ప్రజలు అడ్డుకుంటున్నారు.

Read more