బల్దియా ఎన్నికల్లో కుటుంబ పాలన, ప్రజాస్వామ్యానికి మధ్య పోటీ: అరుణ

ABN , First Publish Date - 2020-11-27T21:34:08+05:30 IST

బీజేపీలో కాంగ్రెస్ నాయకులు చేరుతుండడంతో కమలం పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది.

బల్దియా ఎన్నికల్లో కుటుంబ పాలన, ప్రజాస్వామ్యానికి మధ్య పోటీ: అరుణ

హైదరాబాద్‌: బీజేపీలో కాంగ్రెస్ నాయకులు చేరుతుండడంతో  కమలం పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విక్రమ్‌గౌడ్ శుక్రవారం డీకే అరుణ, భూపేంద్రయాదవ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ..  ప్రజలకు ఇచ్చిన ఏ హామీని టీఆర్‌ఎస్‌ నిలబెట్టుకోలేదని అన్నారు. టీఆర్ఎస్ నాయకుల డ్రామాలను ప్రజలు నమ్మారన్నారు. టీఆర్ఎస్ ఎంఐఏం ఎత్తుగడలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పనిచేయవని విమర్శించారు.కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కాపాడుకోలేకపోయిందన్నారు. బల్దియా ఎన్నికల్లో కుటుంబ పాలన, ప్రజాస్వామ్యానికి మధ్య పోటీ ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారన్నారు.  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని భూపేంద్రయాదవ్ చెప్పారు. 


Read more