ఎంఎస్‌ఎంఈలకు వెసులుబాటు కల్పించండి

ABN , First Publish Date - 2020-05-30T08:27:47+05:30 IST

ఎంఎస్‌ఎంఈలకు వెసులుబాటు కల్పించండి

ఎంఎస్‌ఎంఈలకు వెసులుబాటు కల్పించండి

కేంద్ర మంత్రి నిర్మలకు బండి సంజయ్‌ లేఖ

కేసీఆర్‌ పాలించే హక్కు కోల్పోయారు: అరుణ


సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలకు వడ్డీ మినహాయింపు విషయంలో మరింత వెసులుబాటు కల్పించాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ను కోరారు. ఎంఎ్‌సఎంఈల రుణాలపై వడ్డీ మినహాయింపును 6 నెలల పాటు ఇవ్వాలని శుక్రవారం ఆమెకు లేఖ రాశారు. ఉద్యోగులకు పూర్తి వేతనం ఇవ్వలేక, కేంద్రం నిధులిస్తే తప్ప రాష్ట్రం నడవలేని దుస్థితిని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌.. నైతికంగా పరిపాలించే హక్కు కోల్పోయారని బీజేపీ నేత డీకే అరుణ విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం దివాళా తీసిందని ఆరోపించారు.

Updated Date - 2020-05-30T08:27:47+05:30 IST