పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ బూట్లు నాకుతున్నారా?
ABN , First Publish Date - 2020-10-19T08:43:31+05:30 IST
పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ బూట్లు నాకుతున్నారా?

పదవులకు రాజీనామా ఎందుకు చేయరు?: డీకే అరుణ
హైదరాబాద్, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం కేసీఆర్.. పాలమూరు రైతాంగం పొట్టగొడుతుంటే ఆయన బూట్లు నాకుతున్నారా? మీ నోళ్లు పడిపోయాయా? ఎందుకు మీ పదవులకు రాజీనామా చేయరు?’’ అంటూ మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్లు మార్చవద్దంటూ 2016లో సంతకాలు చేసి, సీఎంను కోరిన మీకు ఇప్పుడేమైంది? అని నిలదీశా రు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు. పాలమూర్డు, డిండి ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఎందుకు ఇప్పటివరకు కేంద్రానికి ఇవ్వలేదో స్పష్టం చేయాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. పాలమూరు ప్రాజెక్టు ఓపెన్ పంప్‌హౌస్ బదులు అండర్‌గ్రౌండ్ పంప్‌హౌస్ కోసం సీఎం డిజైన్ మార్పించారని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధికి ఆరేళ్లలో రూ.67వేల కోట్లు వెచ్చించామని మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనపై స్పందిస్తూ..‘‘ఆ డబ్బులన్నీ ఏ ఫాంహౌ్‌సలో పెట్టారు? మీరు చెప్పిందే నిజమైతే హైదరాబాద్‌లో ఇంతటి వరద బీభత్సం జరిగేదా?’’ అని నిలదీశారు. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలమవుతుంటే, సీఎం కేసీఆర్ కనీసం ఏరియల్ సర్వే కూడా చేయలేదని, ఫాంహౌ్‌సలోనే ఉండిపోయారని ఆమె విమర్శించారు.