అడవి బిడ్డలకు అండగా సీతక్క

ABN , First Publish Date - 2020-05-10T09:16:33+05:30 IST

అడవి బిడ్డల ఆకలి తీర్చేందుకు ములుగు ఎమ్మెల్యే సీతక్క శ్రమిస్తూనే ఉన్నారు. ఆదివాసీలకు నిత్యావసర వస్తువులు అందించేందుకు అడవిలోకి కిలోమీటర్ల మేర కాలినడకన వెళుతున్నారు...

అడవి బిడ్డలకు అండగా సీతక్క

కాలినడకన వెళ్లి నిత్యావసరాల పంపిణీ 


ఆళ్లపల్లి/గుండాల, మే 9: అడవి బిడ్డల ఆకలి తీర్చేందుకు ములుగు ఎమ్మెల్యే సీతక్క శ్రమిస్తూనే ఉన్నారు. ఆదివాసీలకు నిత్యావసర వస్తువులు అందించేందుకు అడవిలోకి కిలోమీటర్ల మేర కాలినడకన వెళుతున్నారు. శనివారం నియోజకవర్గ పరిఽధిలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని అటవీ గ్రామాల్లో ఆమె పర్యటించారు. ములు గు జిల్లాకు 120 కి.మీ దూరంలోని ఆళ్లపల్లి మండలం బూసరాయి గ్రామంలో ఉన్న 37 వలస ఆదివాసీ కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. గుండాల మండలం సజ్జలబోడు, టేకులపల్లి మండలం మోట్లగూడెంలో నిత్యావసరాలను అందించారు.  

Updated Date - 2020-05-10T09:16:33+05:30 IST