40 లక్షల మాస్క్‌లు.. ఒక్కోటి రూ.12

ABN , First Publish Date - 2020-05-19T09:55:06+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో పాటు వృద్ధులకు వస్త్రంతో తయారు చేసిన మాస్క్‌లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

40 లక్షల మాస్క్‌లు.. ఒక్కోటి రూ.12

  • వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పంపిణీ


కరోనా వ్యాప్తి నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో పాటు వృద్ధులకు వస్త్రంతో తయారు చేసిన మాస్క్‌లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 40 లక్షల మాస్క్‌లను తయారు చేయిస్తున్నారు. ఒక్కో మాస్కు ధర రూ.12గా నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక మహిళా బృందాల సేవలను వాడుకోనున్నారు. వీరితోపాటు చేనేత కార్మికులకు కూడా అవసరాన్ని బట్టి ఆర్డర్‌ ఇవ్వాలని యోచిస్తోంది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, కేన్సర్‌, టీబీ, బీపీ, షుగర్‌తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఈ మాస్క్‌లు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో 65 ఏళ్లు దాటిన వారు 23.5లక్షలు, బీపీ, షుగర్‌ పేషెంట్లు 16.35లక్షలు, టీబీ, హెచ్‌ఐవీ రోగులు 1.25 లక్షలు, మూత్రపిండాల వైఫల్య రోగులు 9వేల మంది వరకు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అంచనా.

Updated Date - 2020-05-19T09:55:06+05:30 IST