హైదరాబాద్-తిరుపతి మధ్య తగ్గనున్న దూరం

ABN , First Publish Date - 2020-10-27T19:56:36+05:30 IST

తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కరివేన వరకు ..

హైదరాబాద్-తిరుపతి మధ్య తగ్గనున్న దూరం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కరివేన వరకు 122  కిలోమీటర్ల జాతీయ రహదారి  నిర్మాణానికి  కేంద్ర జాతీయ రహదారుల శాఖ అంగీకారం తెలిపింది. ఈ నూతన జాతీయ రహదారితో హైదరాబాద్‌ నుంచి తిరుపతి మద్య 80 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. కల్వకుర్తి, నాగర్ కర్నూల్ , కొల్లాపూర్, ఆత్మకూరు,  నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనుంది. 

Updated Date - 2020-10-27T19:56:36+05:30 IST