ఎమ్మెల్సీ కవితపై అనర్హత వేటు వేయాలి: బీజేపీ
ABN , First Publish Date - 2020-12-03T07:41:49+05:30 IST
రెండు చోట్ల ఓటు హక్కు వినియోగించుకుని ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల

రెండు చోట్ల ఓటు హక్కు వినియోగించుకుని ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనర్హత వేటు వేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు.
బోధన్ నియోజకవర్గంలో ఓటరుగా పేరు నమోదు చేసుకుని ఉన్న కవిత.. తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఖైరతాబాద్ పరిధిలోని బంజారాహిల్స్ డివిజన్‌లోమళ్లీ పేరు నమోదు చేసుకుని ఓటుహక్కు వినియోగించుకున్నారని తెలిపారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ రెండు చోట్ల ఓటరుగా కొనసాగడం దురదృష్టకరమని పేర్కొన్నారు.