వికటించిన టీకా.. 3 నెలల బాలుడి మృతి

ABN , First Publish Date - 2020-03-15T10:51:08+05:30 IST

టీకా వికటించి మూడు నెలల బాలుడు మృతి చెందాడు. కామారెడ్డి పరిధిలోని రామేశ్వర్‌పల్లికి చెందిన సంతోశ్‌ కుమార్‌-రమ్యశ్రీల మూడు నెలల కుమారుడు శివకు శనివారం అంగన్‌వాడీ సెంటర్‌లో టీకా ఇప్పించారు.

వికటించిన టీకా.. 3 నెలల బాలుడి మృతి

కామారెడ్డి, మార్చి 14: టీకా వికటించి మూడు నెలల బాలుడు మృతి చెందాడు. కామారెడ్డి పరిధిలోని రామేశ్వర్‌పల్లికి చెందిన సంతోశ్‌ కుమార్‌-రమ్యశ్రీల మూడు నెలల కుమారుడు శివకు శనివారం అంగన్‌వాడీ సెంటర్‌లో టీకా ఇప్పించారు. సాయంత్రం 4 గంటలకు చిన్నారి శరీరం చల్లగా ఉండటంతో గాబరా పడిన తల్లిదండ్రులు వెంటనే కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పసిగుడ్డు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.

Updated Date - 2020-03-15T10:51:08+05:30 IST