అంతర్రాష్ట్ర బస్సులపై 24న చర్చలు
ABN , First Publish Date - 2020-06-23T09:43:18+05:30 IST
అంతర్రాష్ట్ర బస్సుల విషయమై ఈ నెల 23న నిర్వహించాల్సిన చర్చలు 24కు వాయిదా పడ్డాయి. ఈ నెల 18న విజయవాడలో ఈడీల మధ్య చర్చల్లో.. ఏపీ మొదటి దశ కింద 256 బస్సులను ప్రారంభిస్తామని చెప్పింది.

హైదరాబాద్, జూన్ 22(ఆంధ్రజ్యోతి): అంతర్రాష్ట్ర బస్సుల విషయమై ఈ నెల 23న నిర్వహించాల్సిన చర్చలు 24కు వాయిదా పడ్డాయి. ఈ నెల 18న విజయవాడలో ఈడీల మధ్య చర్చల్లో.. ఏపీ మొదటి దశ కింద 256 బస్సులను ప్రారంభిస్తామని చెప్పింది. తెలంగాణకు సంబంధించి ఈ నెల 23న హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో చర్చలు జరిపి తొలి దశ బస్సుల సంఖ్యను ఖరారు చేసుకుందామని ఇరు రాష్ట్రాల అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. కానీ... ఏపీ అధికారులు 23న కాకుండా, 24న వస్తామంటూ సమాచారం ఇవ్వడంతో చర్చలను 24కు వాయుదా వేసినట్లు బస్ భవన్ వర్గాలు తెలిపాయి. ప్రతి రోజూ విధుల కోసం రిపోర్టు చేసి, రిజిస్టర్‌లో సంతకాలు చేసే కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర సిబ్బందికి వేతనాలివ్వాలని ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.