మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటుపై చర్చ
ABN , First Publish Date - 2020-09-03T20:16:59+05:30 IST
మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్షణరావు అలియాస్ గణపతి లొంగుబాటు వార్తలపై జోరుగా చర్చ జరుగుతోంది.

జగిత్యాల జిల్లా: మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్షణరావు అలియాస్ గణపతి లొంగుబాటు వార్తలపై జోరుగా చర్చ జరుగుతోంది. గణపతి సొంతగ్రామం బీర్పూర్‌లో మందుపాతర పేలిన ఘటనకు 32 ఏళ్లు అయింది. లక్షణరావు లొంగుబాటు సందర్భంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గత చరిత్రను గుర్తు చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా బీర్పూర్ గ్రామస్తులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ గణపతితో ఉన్న పరిచయం గురించి చెప్పారు. గణపతి తమ గ్రామానికి వస్తే చూస్తామని అన్నారు. ఆయనతో ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఊరు విడిచి ఐదు దశాబ్దాలవుతోందని.. ఇప్పటి వరకు చూడలేదన్నారు. ఇప్పుడు వస్తే తప్పకుండా గణపతిని చూస్తామని గ్రామస్తులు చెప్పారు.