క్రమశిక్షణ కలిగిన నేత.. నంది ఎల్లయ్య: ఉత్తమ్
ABN , First Publish Date - 2020-08-11T09:15:45+05:30 IST
క్రమశిక్షణ కలిగిన నేత నంది ఎల్లయ్య అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌లో సోమవారం నంది ఎల్లయ్య

హైదరాబాద్, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): క్రమశిక్షణ కలిగిన నేత నంది ఎల్లయ్య అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌లో సోమవారం నంది ఎల్లయ్య సంతాప సమావేశం నిర్వహించారు. ఇందులో ఖుంటియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, కుసుమ్‌కుమార్, పొన్నం ప్రభాకర్, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ నంది ఎల్లయ్య మరణం కాంగ్రె్‌సకు తీరని లోటని, ఆయన జీవితం ఆదర్శనీయమని అన్నారు. ఖుంటియా మాట్లాడుతూ ఎల్లయ్య.. దళిత వర్గాల ఆశాజ్యోతి అన్నారు.