డిండి రిజర్వాయర్ నుంచి భారీగా వరద నీరు లీకేజీ
ABN , First Publish Date - 2020-12-19T16:20:19+05:30 IST
డిండి రిజర్వాయర్ నుంచి భారీగా వరద నీరు లీకేజీ అవుతోంది. నీరు లీకేజీ అవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నల్గొండ: డిండి రిజర్వాయర్ నుంచి భారీగా వరద నీరు లీకేజీ అవుతోంది. నీరు లీకేజీ అవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు వృథాగా పోతున్న పట్టించుకోరా అని రైతులు అధికారుల తీరును నిలదీశారు. దాదాపు పదేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో డిండి ప్రాజెక్ట్ నిండింది. అధికారులు స్పందించి లీకేజీ అవుతున్న నీటి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరారు.