కరెన్సీ కంటే డిజిటల్‌ చెల్లింపులే మేలు: ఈటల

ABN , First Publish Date - 2020-03-25T10:00:25+05:30 IST

కరెన్సీతోనూ కరోనా వ్యాప్తి చెందుతుందని, కొనుగోళ్లకు డిజిటల్‌ చెల్లింపులు చేయమని మంత్రి ఈటల రాజేందర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనతా

కరెన్సీ కంటే డిజిటల్‌ చెల్లింపులే మేలు: ఈటల

కరెన్సీతోనూ కరోనా వ్యాప్తి చెందుతుందని, కొనుగోళ్లకు డిజిటల్‌ చెల్లింపులు చేయమని మంత్రి ఈటల రాజేందర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, అత్యవసర సేవలపై మంత్రి మంగళవారం అధికారులతో సమీక్షించారు. కూరగాయల మార్కెట్ల వద్ద పెద్దఎత్తున జనం గుమికూడకుండా, సామాజిక దూరం పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ధరలు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మటన్‌, ఎగ్స్‌, చికెన్‌, ఫిష్‌ మార్కెట్లు అన్నీ తెరిచి ఉంటాయని, కోళ్ల, పశువుల దాణా సరఫరా చేస్తున్న వాహనాలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. 

Read more